News January 7, 2026
HYDలో IPS అధికారుల బదిలీలు.. పోస్టింగ్‌ల వివరాలు!

సౌత్ రేంజ్ అడిషనల్ కమిషనర్(L&O)గా తప్సీర్ ఇక్బల్, నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్‌గా ఎన్.శ్వేత, హైదరాబాద్ SP BR జాయింట్ కమిషనర్‌గా విజయ్ కుమార్ నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. సికింద్రాబాద్ DCPగా రక్షితామూర్తి, చార్మినార్ జోన్ DCP-కిరణ్ ప్రభాకర్, ఖైరతాబాద్ DCP-శిల్పవల్లి, గోల్కొండ DCP-G.చంద్రమోహన్, జూబ్లీహిల్స్ DCP-రమణా రెడ్డి, శంషాబాద్ DCP-రాజేశ్ బదిలీ అయ్యారు.
Similar News
News February 20, 2026
HYD: 60% వరకు రాయితీతో బైకులు

PM మత్స్య సంపద యోజన కింద HYD జిల్లాలో అర్హతగల మత్స్యకారులకు 16 బైకులు (ఐస్ బాక్స్‌తో) మంజూరు చేసినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి రజిని తెలిపారు. ఒక్క యూనిట్ విలువ రూ.75,000 అని స్పష్టంచేశారు. జనరల్, SC/STలకు 40% (రూ.30వేలు), మహిళలకు 60% (రూ.45వేలు) రాయితీ ఉంటుంది. చేపల అమ్మకంలో అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 26లోగా మాసబ్‌ట్యాంక్ మత్స్యభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
News February 20, 2026
రంజాన్ మాసంలో చార్మినార్‌కు కొత్త అందాలు

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్‌గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్‌ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.
News February 20, 2026
HYD: రోజుకు ₹70తో ఇవన్నీ సాధ్యమా?

అమీర్‌పేట్ సర్కార్ హోమ్లోని 505 మంది ఇన్‌మేట్స్ కోసం రూ.1.27CRతో మెనూ సిద్ధమైంది. ఆదివారం చికెన్, నిత్యం రాగిజావ, పల్లీలడ్లు, పండ్లు, గుడ్లు ఇవన్నీ రాజభోగంలా ఉన్నా.. నెలకు ఒక్కరికి కేటాయించింది ₹2,100 మాత్రమే. అంటే రోజుకు ₹70 అన్నమాట. దీంతో ఇది సాధ్యమేనా? అన్నది అసలు ప్రశ్న. గుడ్డు ₹6, పాలు లీటర్ ₹85- 90, గ్యాస్ దాదాపు ₹2వేలు సర్కార్ ఫిక్స్ చేసిన ₹70తో ఇవ్వన్నీ అందించడం కత్తిమీద సామే.


