News August 8, 2024

HYDలో JOBS.. APPLY చేసుకోండి..!

image

HYD బాలాపూర్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అంట్ మెటీరియల్స్(ARCI) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి 28-30 ఏళ్లు మించకూడదు. రూ.57,960- రూ.69,120 జీతం ఉంటుంది. AUG 26లోపు https://www.arci.res.in/careers/లో అప్లై చేసుకోండి. SHARE IT

Similar News

News March 3, 2026

GHMC: ప్రభుత్వ భవనాలే రూ.వెయ్యి కోట్ల బాకీ?

image

GHMC విభజన తర్వాత ఖజానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే దాదాపు ₹1,000 కోట్లు బకాయి ఉన్నాయి. సామాన్యుడిపై కొరడా ఝుళిపించే యంత్రాంగం ప్రభుత్వ సంస్థల బకాయిలను ఎలా వసూలు చేస్తుందో చూడాలి.

News March 3, 2026

మంత్రి ఆకస్మిక తనిఖీ.. బల్కంపేట ఆలయ ఈవో సస్పెండ్

image

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఇన్‌ఛార్జీ ఈఓ తమ్మినేని శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో అన్ని మారాలని అధికారులకు హెచ్చరించారు. నిర్వహణలో బాధ్యత రహితంగా వహించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించగా అధికారులు సస్పెండ్ చేశారు.

News March 3, 2026

హుస్సేన్‌సాగర్‌కు కొత్త కళ

image

ట్యాంక్‌బండ్ తీరానికి కొత్త కళ రాబోతోంది. బుద్ధభవన్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు ఛత్ పూజ, బతుకమ్మ ఘాట్ల విస్తరణకు HMDA రూ.3.16 కోట్లతో పనులు చేపట్టనుంది. PVNR మార్గ్ వెంబడి తీరాన్ని పటిష్ఠం చేస్తూ రివెట్‌మెంట్ పనులు చేపట్టనున్నారు. పనుల్లో భాగంగా 5,424 చదరపు మీటర్ల మేర అందమైన పెయింటింగ్స్‌తో గోడలను తీర్చిదిద్దనున్నారు. నాలుగేళ్ల గడువులోగా ఈ సుందరీకరణ పనులు పూర్తి చేసేలా సర్కారు అడుగులు వేస్తోంది.