News February 20, 2025

HYDలో KCR సమావేశం.. కీలకనేతలు డుమ్మా

image

తెలంగాణ భవన్‌లో బుధవారం KCR అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ కీలక నేతలు రాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వదిన దశదినకర్మ నేపథ్యంలో హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాల సమాచారం. కాగా.. మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరుకు గల కారణాలు తెలియాల్సింది ఉంది.

Similar News

News December 14, 2025

నంద్యాలలో 2,452 కేసుల పరిష్కారం

image

నంద్యాల లోక్ అదాలత్‌లో 2,452 కేసులు పరిష్కారమయ్యాయని న్యాయమూర్తి అమ్మనరాజా తెలిపారు. సీసీ కేసులు 79, ఎస్టీసీ కేసులు 1952, డీవీసీ 1, మెయింటెనెన్స్ 3, ఎక్సైజ్ 57, అడ్మిషన్స్ 32, ఓఎస్ 87, క్రిమినల్ 2, ఎంవీ ఓపీ 30 కేసులు పరిష్కరించామని వివరించారు. ఎక్సైజ్, అడ్మిషన్స్, ఎస్టీసీ కేసుల ద్వారా రూ.20,47,969 ప్రభుత్వానికి ఆదాయం లభించిందన్నారు. మోటారు వెహికల్ ప్రమాదంలో లబ్ధిదారులకు రూ.6.24 కోట్లు అందజేశారు.

News December 14, 2025

రేపు అనకాపల్లి కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

image

అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మున్సిపల్, మండల కార్యాలయాల్లో ఈ నెల 15వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. స్వయంగా రావడానికి అవకాశం లేనివారు meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అర్జీలను నమోదు చేసుకోవచ్చనని సూచించారు. అర్జీల పరిస్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు కాల్ చేయాలని పేర్కొన్నారు.

News December 14, 2025

మరికల్: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ వినీత్

image

నారాయణపేట జిల్లాలో నిర్వహిస్తున్న రెండో విడత పోలింగ్ కేంద్రాలను నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మరికల్ మండల కేంద్రంలో పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతియుతంగా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ జరుగుతున్నట్లు తెలిపారు. నాలుగు మండలాల్లోని 95 గ్రామపంచాయతీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అదనపు ఎస్పీ రియాజ్ పోలీసులు ఉన్నారు.