News December 31, 2024
HYDలో NEW YEAR సెలబ్రేషన్స్ బంద్‌కు పిలుపు

‘విదేశీ విష సంస్కృతిని విడనాడుదాం. స్వదేశీ సంస్కృతిని కాపాడుదాం. జనవరి ఒకటి వద్దు’ అంటూ BJP నేతలు పిలుపునిస్తున్నారు. అల్లాపూర్‌లోని గాయత్రీనగర్‌లో సోమవారం గాంధీ విగ్రహం నుంచి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. జనవరి ఒకటిన తేదీ మారడం తప్పా ఇంకో సంబరం ఏమీ లేదన్నారు. ఉగాది మన కొత్త సంవత్సరం అని గుర్తు చేశారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News September 19, 2025
HYD: ఎకో టూరిజం ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

HYDలో ఎకో టూరిజం ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లపై చర్చ జరుగుతోంది. తెలంగాణ టూరిజాన్ని దేశవ్యాప్తంగా ఫేమస్ చేయాలని, టూరిజం ద్వారానే మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
News September 19, 2025
HYD: సచివాలయంలో హెల్త్ మినిస్టర్ సమీక్ష

HYDలోని తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్పత్రుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చ సాగుతోంది. కొత్తగా నిర్మిస్తోన్న ఆసుపత్రులతోపాటు మరికొన్ని ఆస్పత్రులు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
News September 19, 2025
HYD: బతుకమ్మ వేడుక.. బస్సులు సిద్ధం ఇక..!

బతుకమ్మ వేడుకలు.. దసరా సెలవులు త్వరలో రానుండటంతో సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. MGBS, ఆరాంఘర్, జేబీఎస్, KPHB కాలనీ, ఎల్‌బీనగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికులు వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లకు ఫోన్ చేయొచ్చు. SHARE IT