News September 7, 2025
HYDలో PHOTO OF THE DAY

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనోత్సవం సాగర తీరాన జనసంద్రాన్ని తలపించింది. ఉదయం ఖైరతాబాద్ మండపం నుంచి మొదలైన భారీ శోభాయాత్రకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. సెక్రటేరియట్ వద్దకు విగ్రహం చేరుకోగా ఇసుకేస్తే రాలనంత జనం గుమిగూడారు. చుక్కల్లో చంద్రుడి వలే భారీ ఆకారంలో మహా గణపతి, ఆ పక్కనే సచివాలయం ఒకే ఫ్రేమ్‌లో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యం సిటీలో PHOTO OF THE DAYగా నిలిచింది.
Similar News
News September 7, 2025
HYD: నంది వాహనం ఎక్కిన ‘శివ’పుత్రుడు

వినాయక నిమజ్జనోత్సవంలో ‘శివ’పుత్రులు దర్శనమిచ్చారు. అవును.. హిమాయత్‌నగర్‌లో ఈ దృశ్యం భక్తులను కనువిందు చేసింది. శనివారం ట్యాంక్‌బండ్‌కు ఎడ్లబండి మీద ఓ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొచ్చారు. రథసారథిగా శివుడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంది వాహనం ఎక్కి గణపయ్య వస్తున్నాడు అంటూ భక్తులు పరవశించిపోయారు. ఈ వినూత్న ఆలోచన బాగుంది కదూ.
News September 7, 2025
చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల నిరసన

చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి స్పందించట్లేదని మండిపడ్డారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్దత గల జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 15 వేల పోస్టులతో మెగా DSC, 7,500 పోస్టులతో GPO నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్యాగాలు మావీ.. భోగాలు మీవా అంటూ నినాదాలు చేశారు.
News September 6, 2025