News August 21, 2025
HYDలో SMART మీటర్ వాల్వ్‌లు వస్తున్నాయి!

జలమండలి పరిధిలో దాదాపుగా 5,000 వరకు గృహాలకు సరఫరా చేసేందుకు మెయిన్ వాల్వ్‌లు ఉన్నాయి. వీటిలో మొదట 1000 వాల్వ్‌లను స్మార్ట్ వాల్వ్‌లుగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్మార్ట్ ఆటోమేటిక్ వాల్వ్‌లతో నిర్ణీత సమయంలో నీటిని సరఫరా చేయడం, నాణ్యత గుర్తించడం, ఇతర సమస్యలకు చెక్ పెట్టొచ్చనే నేపథ్యంలో వాటిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 26, 2026
వేములవాడ: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. నలుగురికి గాయాలు!

వేములవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గురువారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో బస్సు.. కారును ఢీకొట్టి రోడ్డు డివైడర్ పైకి ఎక్కింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి గాయాలైనట్లు సమాచారం. బస్సులో ఉన్నవారు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 26, 2026
గిరిజన ఉత్పత్తులకు ‘భద్రగిరి మార్ట్’ బ్రాండింగ్

భద్రాచలంలో గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన గిరిజన మ్యూజియం సరసన ఇప్పుడు మరో అద్భుత కట్టడం చేరింది. గిరిజన ఉత్పత్తులను ఒకే చోట విక్రయించేందుకు వీలుగా భద్రాచలం ITDA ఆధ్వర్యంలో ‘భద్రగిరి మార్ట్’ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ITDA PO తన మార్కు నూతన ఆవిష్కరణలతో ఈ మార్ట్‌ను అద్భుతంగా రూపొందించారు. గిరిజన రైతులు, మహిళా సంఘాలు తయారుచేసే సహజ సిద్ధమైన ఉత్పత్తుల విక్రయాలకు ఈ భవనాన్ని నిర్మించారు.
News March 26, 2026
HNK: రెవెన్యూ కాలనీ రామాలయంలో కలెక్టర్ తలంబ్రాల సమర్పణ

హనుమకొండ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కాలనీ రామాలయం ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా శ్రీ సీతా రాముల కళ్యాణం మహోత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. సుబేదారిలోని కలెక్టరేట్ వెనుక ప్రాంతాల్లో అధికారులు కలిసి హౌసింగ్ సొసైటీ కాలనీ ఏర్పాటు చేసుకున్నారు. గత 20 ఏళ్ల నుంచి ప్రతి ఏటా ఇక్కడ జరిగే వేడుకలకు కలెక్టర్ హోదాలో ఉన్నవారు విధిగా సీతారాములకు తలంబ్రాలు సమర్పిస్తారు. ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.


