News August 21, 2025

HYDలో SMART మీటర్ వాల్వ్‌లు వస్తున్నాయి!

image

జలమండలి పరిధిలో దాదాపుగా 5,000 వరకు గృహాలకు సరఫరా చేసేందుకు మెయిన్ వాల్వ్‌లు ఉన్నాయి. వీటిలో మొదట 1000 వాల్వ్‌లను స్మార్ట్ వాల్వ్‌లుగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్మార్ట్ ఆటోమేటిక్ వాల్వ్‌లతో నిర్ణీత సమయంలో నీటిని సరఫరా చేయడం, నాణ్యత గుర్తించడం, ఇతర సమస్యలకు చెక్ పెట్టొచ్చనే నేపథ్యంలో వాటిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News August 21, 2025

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణకు కొత్త మార్పు

image

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు కొత్త మార్పులు వచ్చాయి. హైదరాబాద్ పోలీసులు, HCSCతో కలిసి 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లు, 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను ప్రారంభించారు. ఇందులో భారతదేశంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లను కూడా నియమించారు. ఈ మార్షల్స్ పోలీసులకు సహకరిస్తారు. ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ఈ చర్యలు తీసుకున్నారు.

News August 21, 2025

HYD: BJPకి బుద్ధి చెప్పండి: CPI నారాయణ

image

స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ బద్ద సంస్థలను BJP ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి, అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుందని CPI జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గాజుల రామారం మహారాజా గార్డెన్స్‌లో జరుగుతోన్న CPI మహాసభల్లో 2వ రోజు పాల్గొని, ప్రసంగించారు. BJP ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని నారాయణ పిలుపునిచ్చారు.

News August 21, 2025

HYD: ఎవడ్రా నువ్ KTR: గజ్జెల కాంతం

image

TPCC ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఈరోజు గాంధీభవన్‌లో మాట్లాడారు. ‘దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్.. అంత గొప్ప పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటావా ఎవడ్రా నువ్ KTR.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే నీ అయ్య KCR ఈ జన్మలో CM కాకపోతుండే, నువ్ మంత్రి కాకపోతుండే.. థర్డ్ క్లాస్ నా కొడుకులు మీరు.. నీ అయ్య చీప్ లిక్కర్ తాక్కుంటా పండి, తాగుబోతు పార్టీ పెట్టిండు.. నీ అయ్య చరిత్ర తెలుసుకో’ అని అన్నారు.