News September 11, 2025
HYDలో ‘U TURN’ తీసుకున్న ట్రాఫిక్ కష్టాలు

సీటీలో యూ టర్న్‌లు ట్రాఫిక్ సమస్యలకు కేంద్రాలుగా మారాయని పలువురు మండిపడుతున్నారు. ఇబ్బందులులేని చోట ట్రాఫిక్ సమస్యలు U TURN తీసుకున్నాయని విమర్శిస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వరకు రష్ టైమ్‌లో యూటర్న్‌ల వద్ద వాహనాలు తిరుగుతుంటే లక్డీకపూల్ వరకు జామ్ అవుతుందని వాపోతున్నారు. నాగోల్‌లో మెట్రో దిగితే ఉప్పల్ వరకు U TURN లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Similar News
News September 11, 2025
ఖైరతాబాద్: నిరుద్యోగ సమస్యలపై మంత్రిని కలిసిన ప్రొ.కోదండరాం

నిరుద్యోగ సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో గురువారం MLCలు ప్రొ.కోదండరాం, అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, భవిష్యత్తులో భర్తీ చేయబోయే ఉద్యోగాలపై స్పష్టమైన ప్రకటన చేస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగుల కోసం సమగ్ర ఉపాధి కల్పన విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
News September 11, 2025
HYD హెల్ప్ లైన్ నం.9063423979

HYDలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ సూచించడంతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిచందన విజ్ఞప్తిచేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ మొబైల్ హెల్ప్‌లైన్ నం. 9063423979కు కాల్ చేసి ఇబ్బందులు ఉంటే తెలిజేయాలని, సందేహాలు నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
News September 11, 2025
సీఎం చేతుల మీదుగా మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ ప్రారంభిస్తాం: మేయర్

బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్ బస్తీలో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె ఖైరతాబాద్ ZC అనురాగ్ జయంతితో కలిసి ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.