News March 14, 2025
HYD: అంగన్‌వాడీలకు సెలవు లేదు

హోలీ సందర్భంగా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. అయితే, అంగన్‌వాడీ ఉద్యోగినులు మాత్రం దీనికి మినహాయింపు. పండుగ రోజున కూడా విధులు నిర్వర్తించాల్సి రావడం వారిలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. కుటుంబంతో హోలీ జరుపుకునే అవకాశాన్ని దూరం చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాన హక్కులు కల్పించాలని, ప్రభుత్వ వైఖరి మారాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News October 17, 2025
మంగళగిరి: ‘మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం’

మంగళగిరిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, ప్యానలిస్టుల కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా తిరుపతి నుంచి సంజీవని స్వరం పేరుతో కార్యక్రమం చేపడతామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మాణానికి చేపట్టిన పీపీపీ విధానంపై వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
News October 17, 2025
HYD: రేపటి బంద్ శాంతియుతంగా జరగాలి: డీజీపీ

వివిధ పార్టీలు తలపెట్టిన రేపటి బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకుగానీ పాల్పడితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తమన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయి. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డీజీపీ సూచించారు.
News October 17, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన INC అభ్యర్థి నవీన్ యాదవ్
* గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల.. 17 ప్యాకేజీల్లో 7,449km రోడ్లకు రూ.6,294 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం
* మద్యం దుకాణాల టెండర్లకు రేపటితో ముగియనున్న గడువు.. 2,620వైన్స్‌లకు 25వేల దరఖాస్తులు
* బీసీ రిజర్వేషన్ల అంశంలో BJPని కాంగ్రెస్ బద్నాం చేస్తోందన్న MP డీకే అరుణ