News March 14, 2025
HYD: అంగన్‌వాడీలకు సెలవు లేదు

హోలీ సందర్భంగా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. అయితే, అంగన్‌వాడీ ఉద్యోగినులు మాత్రం దీనికి మినహాయింపు. పండుగ రోజున కూడా విధులు నిర్వర్తించాల్సి రావడం వారిలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. కుటుంబంతో హోలీ జరుపుకునే అవకాశాన్ని దూరం చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాన హక్కులు కల్పించాలని, ప్రభుత్వ వైఖరి మారాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News March 17, 2026
‘ఉడుతా భక్తి’ అంటే ఏమిటి?

ఎలాంటి స్వార్థం లేకుండా తమ శక్తి మేరకు చేసే చిన్న సహాయం గురించి చెప్పే సందర్భంలో ‘ఉడుతా భక్తి’ జాతీయాన్ని వాడతారు. ఇది రామాయణం నుంచి పుట్టింది. లంకకు రామసేతు నిర్మాణంలో తాను కూడా భాగం కావాలని ఉడుత భావిస్తుంది. నీటిలో తడుస్తూ ఇసుకలో పొర్లాడుతూ ఆ ఇసుకను రాళ్ల మధ్య నింపే ప్రయత్నం చేస్తుంది. అందుకు రాముడు మెచ్చుకొని ఉడుత మీద నిమరడంతో ఏర్పడిన గీతలే ఇప్పటికీ ఉన్నాయని ఓ నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 17, 2026
వంటింటి చిట్కాలు

* నిమ్మజాతి పండ్లు, టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
* వంటింట్లో వాడే స్పాంజీలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన చల్లని నీళ్లలో కాసేపు నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు పోతాయి. దుర్వాసన కూడా ఉండదు.
* పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే పాత్రలు నీచు వాసన రావు.
* తేనె ముద్దగా అయితే, కాసేపు అది ఉన్న సీసాను వేడి నీళ్లలో ఉంచితే సరిపోతుంది.
News March 17, 2026
ADB: రూ.3.38 లక్షల పశువులకు ఉచిత టీకాలు: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో పశువుల సంరక్షణ కోసం నెల రోజుల పాటు సాగే ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 2 లక్షల 90 వేల ఆవులు, 48 వేల గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ వ్యాధితో పాడి రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తోందని, రైతులందరూ వాడుకోవాలని కోరారు. పల్లెల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.


