News May 12, 2024
HYD: అందరూ ఓటేయాలంటూ వినూత్నంగా అవగాహన

ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మేడ్చల్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తారక్ HYDలోని ప్రధాన మార్గాలు, గల్లీగల్లీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 250 కిలోమీటర్లు తన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తన భుజానికి వేసుకున్న బ్యాగ్ పై Vote is Voice #IVOTEFORSURE అని ఓ స్టిక్కర్ అతికించుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.
Similar News
News February 13, 2025
HYD: రంగరాజన్‌పై దాడి.. 12 మంది అరెస్ట్

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడి కేసులో ఇప్పటివరకు పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 14 మంది పరారీలో ఉన్నారు. వీరిలో భద్రాచలం వద్ద మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
News February 13, 2025
HYD: అభిలాష ఉన్నవారికి ఉచితం సంగీతం, నృత్య శిక్షణ

అభిలాష ఉన్నవారికి ఉచితంగా సంగీతం, నృత్య శిక్షణ ఇస్తున్నామని వీఎస్. జనార్దనమూర్తి అన్నారు. గానసభలో 5 రోజుల పాటు సంగీత, సాహిత్య కార్యక్రమాల ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గానసభ లలిత కళలకు నిత్యం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా సంగీత గురువు మల్లాది ఉష్ణ బృందం ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత కార్యక్రమం అద్భుతంగా సాగింది.
News February 13, 2025
HYD: ఫ్రీ కరెంట్.. పైగా ఖాతాలోకి నగదు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ విద్యుత్‌శాఖ ఏఈ మురళీకృష్ణ సూచించారు. ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే ఉపయోగాలు సూచించారు. ప్యానెల్స్‌ను అనుసంధానించి ఇంట్లో ఏర్పాటు చేసిన మీటర్ ద్వారా వినియోగించగా మిగిలిన విద్యుత్ డిస్కంలకు సరఫరా అవుతుంది. డిస్కంలతో ఒప్పందం ప్రకారం 6 నెలలకు ఒకసారి లెక్కేసి ఖాతాలో నగదు జమ చేస్తారు. #SHARE IT