News March 25, 2024

HYD: అందుకే ప్రణీత్‌ను చంపాడు..!

image

HYD బాలానగర్ PS పరిధిలో నిన్న <<12919309>>యువకుడు ప్రణీత్ తేజ(20)ను<<>> అతడి స్నేహితుడు చంపిన విషయం తెలిసిందే. సీఐ నవీన్ తెలిపిన వివరాలు.. ప్రణీత్, సమీర్(20) చిన్న నాటి స్నేహితులు. వీరిద్దరూ కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ జులాయిగా తిరుగుతూ గంజాయి, మద్యానికి బానిసలయ్యారు. ఈక్రమంలో తన తల్లిని ప్రణీత్ బూతులు తిట్టాడని కోపం పెంచుకున్న సమీర్.. స్థానికంగా పార్కింగ్ చేసిన బస్సులోకి ప్రణీత్‌ను తీసుకెళ్లి దారుణంగా చంపాడు.

Similar News

News April 19, 2026

హైదరాబాద్‌లో హడలెత్తిస్తోన్న ‘హార్ట్ స్ట్రోక్’

image

హైదరాబాద్‌లో ‘హార్ట్ స్ట్రోక్’ హడలెత్తిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. చెడు అలవాట్లు లేని వారినీ ఈ ప్రాణాంతక వ్యాధి వదలడం లేదు. ఛాతిలో నొప్పిగా అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, సరిపడా నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొంటున్నారు.

ఉప్పల్ స్టేడియంలో తండ్రీకొడుకుల డ్యూటీ

image

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ బందోబస్తులో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఎస్‌బీ ఏసీపీ రవీందర్ రెడ్డి, ఆయన కుమారుడు ట్రైనీ డీఎస్సీ శంతన్ కుమార్ రెడ్డి ఒకే చోట విధులు నిర్వహించారు. తండ్రీకొడుకులు ఇద్దరూ పోలీసు శాఖలో ఉండటంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది వారిని అభినందించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అధికారులు ఒకే కార్యక్రమంలో విధులు నిర్వర్తించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.