News June 5, 2024
HYD: అందెశ్రీని సన్మానించిన సీఎస్ శాంతికుమారి
ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత డా.అందెశ్రీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని HYDలోని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా.అందెశ్రీని శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సీఎస్ సత్కరించారు. ఈ సందర్భంగా తాను రచించిన పలు పుస్తకాలను సీఎస్ శాంతి కుమారికి అందెశ్రీ అందజేశారు.
Similar News
News November 29, 2024
HYD: సైకో.. యువతిని చంపేసి అత్యాచారం!
సైకో కిల్లర్ రాహుల్ కేసులో భయంకర నిజాలు వెలుగుచూశాయి. ఈ నెల 14న ఓ యువతిని హత్యాచారం చేసిన కేసులో వల్సాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. హత్య చేసి అదే మృతదేహాం పక్కన నిద్రించే అలావాటు రాహుల్కు ఉందని గుర్తించారు. సదరు యువతి(19)ని తోటలో చంపిన తర్వాత రెండోసారి అత్యాచారం చేశాడన్నారు. అయితే, <<14729624>>సికింద్రాబాద్-మణుగూరు<<>> రైలులో రమణమ్మను చంపిన ఈ నరహంతకుడిని HYD తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
News November 29, 2024
HYD: అప్పు చేసి పిల్లలకు వంట చేస్తున్నారు: CITU
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు MEO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. CITU జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్ మాట్లాడారు. కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, మెనూ ఛార్జీలు పెండింగులో ఉన్నాయన్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతూ.. కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
News November 28, 2024
HYD: 26 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య
వచ్చే డీఎస్సీలో 26 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దిల్సుఖ్నగర్లో జరిగిన నిరుద్యోగుల సభలో మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. ఏ పాఠశాలకు వెళ్లినా టీచర్ల కొరత ఉందన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో 6 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వటం లేదన్నారు.