News October 16, 2024

HYD: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

DR.BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ సుధారాణి తెలిపారు. 2022-23, 2023-24లో డిగ్రీలో చేరిన 2nd, 3rd ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, సకాలంలో ఫీజు చెల్లించని వారు 30తేదీలోపు చెల్లించొచ్చని తెలిపారు. braouonline వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయన్నారు.

Similar News

News October 26, 2025

జూబ్లీ బైపోల్ ఆ ముగ్గురికి అగ్నిపరీక్ష

image

జూబ్లీ బైపోల్ రేవంత్, KTR, రాంచందర్‌రావుకు ప్రతిష్ఠ పోరైంది. గెలుపు, ఓటమి పనితీరుకు తీర్పు కానుంది. గెలిస్తే రేవంత్‌రెడ్డి పాలనకు రెఫరెండమ్‌గా భావించొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ KTR చూస్తున్నారు. BRS గెలిస్తే సీటీలో ఆయన ఇమేజ్ బలపడి, ఆయన నాయకత్వానికి ఈ తీర్పు సూచికవుతుంది. BJP TG చీఫ్ రాంచందర్‌రావుకు ఇదే తొలిఎలక్షన్. బోణి కొడితే ఆయన నాయకత్వంపై అందరిలో స్పష్టత వస్తుంది.

News October 26, 2025

నేడు HYDలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

image

HYDలో ఆకాశం మేఘావృతమై ఉంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ‘నేడు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉదయం పొగమంచు పరిస్థితులు కనిపించొచ్చు. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 22°Cగా నమోదయ్యే అవకాశం ఉంది’ అని పేర్కొంది.

News October 26, 2025

నెత్తురోడుతున్న ‘సికింద్రాబాద్’ రైల్వే పట్టాలు

image

సికింద్రాబాద్ పరిధిలో రైల్వే పట్టాలు నెత్తురోడుతున్నాయి. SEC రైల్వే పోలీస్ జిల్లా పరిధిలో 2025లో OCT 20 నాటికి సుమారు 500 ప్రమాదాలు జరగగా, 400 వరకు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలకు శోకం మిగల్చొద్దని RPF టీం సూచించింది.