News May 21, 2024
HYD: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీ

HYD నగరంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీని ప్రభుత్వం నియమించింది. 1999 IAS బ్యాచ్ అధికారి అయిన రజ్వీ, గతంలో కృష్ణా జిల్లా, HYD జిల్లాల్లో కలెక్టర్, తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాక TRANSCO, GENCO విద్యుత్ సంస్థలకు ఎండీగా, రాష్ట్ర ఎనర్జీ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ విధుల్లో ఉన్న ఆయనను ప్రభుత్వం ఓపెన్ యూనివర్సిటీకి వీసీ బాధ్యతలను అప్పగించింది.
Similar News
News February 23, 2026
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు 200 కేంద్రాలు..!

ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో 200 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెంక్యానాయక్ తెలిపారు. 84,301 మంది ప్రథమ సంవత్సరం, 70,171 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
News February 21, 2026
RR: వారికి 100% రాయితీతో రూ.60వేలు

రాళ్లు కత్తిరించే వృత్తిలో అనుభవం ఉన్న ముస్లింలకు పునరావాసం, జీవనోపాధి కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుడికి రూ.60 వేల చొప్పున, రూ.10 వేల విలువైన టూల్ కిట్, రూ.50 వేల విలువైన జనరేటర్‌ను 100% సబ్సిడీ కింద అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 1 వరకు http://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
News February 21, 2026
బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) ప్రతిమా సింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన ప్రతిమాసింగ్ ప్రసూతి సెలవులపై వెళ్లారు. ప్రసూతి సెలవులు ముగియడంతో ఆమె శనివారం తిరిగి అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు అదనపు కలెక్టర్‌ను కలిసి బొకే సమర్పించారు.


