News November 14, 2024
HYD: అక్కడేమో పూజలు.. ఇక్కడేమో ఇలా..!
VKB అనంతగిరి కొండల్లో పుట్టిన మూసికి అక్కడికి వెళ్లిన పర్యటకులు పూలు చల్లి పూజలు చేసి, స్వచ్ఛమైన నీటితో దైవాభిషేకం చేస్తున్నారు. మరి అదే మూసీ.. VKB ప్రాంతంలో పూజలు చేసిన వారే.. HYDలో మూసీని చూడగానే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. PCB ప్రమాణాలకు మించి మూసీ కలుషితమైంది. దీంతో HYDలో 55KM మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని ప్రభుత్వం అంటుంది.
Similar News
News December 8, 2024
HYD: మోసపూరిత హామీలతో కాంగ్రెస్ దగా చేసింది: నడ్డా
మోసపూరితపు హామీలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జెపి నడ్డా మండిపడ్డారు. HYD సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మహిళలు, యువత, రైతులు, వెనుకబడిన వారికి అబద్దపు హామీలిచ్చిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య భావాజాలంతో పాటు, ప్రజలకు సేవ చేయడంలోనూ తేడాలు ఉన్నాయన్నారు.
News December 8, 2024
HYD: GOOD NEWS.. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
ఆర్మీలో చేరాలనుకున్న వారికి సికింద్రాబాద్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ అధికారులు శుభవార్త తెలిపారు. 2025 జనవరి 6 నుంచి మార్చి 9 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుందని ప్రకటించారు. అగ్నివీర్ పోస్టుల కోసం ఈ ర్యాలీ జరగనుంది. స్పోర్ట్స్ మెన్ ఓపెన్ కోటా అభ్యర్థులు సికింద్రాబాద్ జోగేంద్ర సింగ్ స్టేడియంలో జనవరి 3వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు www.joinindianarmy@nic.in సైట్ సంప్రదించండి.
News December 8, 2024
HYD నగరంలో మెరుగుపడ్డ గాలి నాణ్యత
HYDలో గత నెలతో పోలిస్తే పలుచోట్ల గాలి నాణ్యత మెరుగుపడింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) రిపోర్ట్ విడుదల చేసింది. జూపార్క్-129, బొల్లారం-103, పటాన్‌చెరు-82, ECIL-70, సోమాజిగూడ-75, కోకాపేట-69, HCU-68, నాచారం-60, సనత్‌నగర్-50గా నమోదైంది. గత నెలలో సనత్‌నగర్‌లో AQI ఏకంగా 150కి పైగా రికార్డైంది. AQI 100 ధాటితే శ్వాసకోస సమస్యలు ఉన్నవారికి ప్రమాదం.