News April 9, 2025
HYD: అక్కడ అన్ని పుస్తకాలు చవక..!

HYDలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ నాంపల్లి గ్రౌండ్లో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఏప్రిల్ 17వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. సాహిత్యం, నాట్యం, సంగీతం, జీవితచరిత్రలు, ఆదివాసి జీవన విధానం, అనేక పరిశోధన గ్రంథాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
Similar News
News October 29, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: భద్రతకు 720 మంది కేంద్ర బలగాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పకడ్బందీగా.. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర బలగాలనూ వినియోగించుకుంటోంది. 8 కంపెనీలకు చెందిన బలగాలు నియోజకవర్గానికి వచ్చేశాయి. ఒక్కో కంపెనీలో 90 మంది చొప్పున మొత్తం 720 మంది సిటీకి చేరుకున్నారు. వీరికితోడు 1,666 మంది స్థానిక పోలీసులు భద్రతలో పాలుపంచుకుంటారు.
News October 29, 2025
జూబ్లీ బైపోల్‌లో 52 కమల దళాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయంపై బీజేపీ నేతలు దృష్టి సారించారు. అందుకే నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 52 కమల దళాలను రంగంలోకి దింపింది అధిష్ఠానం. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు ఇలా 160 మంది జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపే దాదాపు 70 పెద్ద కాలనీల్లో ఇల్లిల్లూ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
News October 29, 2025
జూబ్లీహిల్స్ ప్రచారంపై.. మొంథా ఎఫెక్ట్

HYDలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కాంగ్రెస్, BRS, BJPలు ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వర్షానికి ప్రభావితమైంది. దీనికారణంగా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నియోజకవర్గంలో తన పర్యటన, విలేకరుల సమావేశాన్ని ఇప్పటికే రద్దు చేసుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రచారాన్ని త్వరగా ముగించారు. వర్షాల నుంచి ఉపశమనం కోసం అఖిలపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారు.


