News September 23, 2024
HYD: అక్టోబర్ 2 నుంచి ఆపరేషన్ సీవరెజ్
గ్రేటర్ HYD నగరంలో అక్టోబర్ 2 నుంచి జలమండలి ఆపరేషన్ సీవరెజ్ చేపట్టనుంది. 30 రోజుల పాటు 7050 కిలోమీటర్ల డ్రైనేజీ లైన్లను క్లీన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 225 ఎయిర్ టేక్ యంత్రాలను సైతం వినియోగించనున్నారు. జలమండలి పరిధిలోని అనేక చోట్ల చిన్నపాటి వర్షాలకే దాదాపు 3 లక్షల వరకు మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.
Similar News
News October 15, 2024
BREAKING: HYD: గోనెసంచిలో బాలిక మృతదేహం
HYD మేడ్చల్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసరగడి గ్రామంలో గోనెసంచిలో బాలిక మృతదేహం లభించింది. ఈనెల 12న కుమార్తె జోష్న(7) కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయడంతో ఈరోజు బాలిక మృతదేహం గోనెసంచిలో కనిపించింది. దీంతో కేసు నమోదు చేసి, బాలికను ఎవరు హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News October 15, 2024
HYD: NIMSలో పేషంట్ల కోసం స్పెషల్ OP
అంటువ్యాధుల చికిత్స కోసం HYD పంజాగుట్ట NIMS ఆస్పత్రిలో ప్రతి మంగళ, గురువారం ఓపీ సేవలు అందిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్, క్షయ, బ్లాక్ ఫంగస్, వైరల్ ఇన్ఫెక్షన్లకు ఈ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. న్యుమోనియా, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, కిడ్నీ, కాలేయం లాంటి అవయవ మార్పిడి తర్వాత సోకే ఇన్ఫెక్షన్లనూ నయం చేస్తున్నట్లు తెలిపారు.
News October 15, 2024
HYD: కాంక్లేవ్‌లో సత్తా చాటిన విద్యార్థులు
యునైటెడ్ నేషన్స్ పీస్ క్రాఫ్టర్స్ కాంక్లేవ్‌లో HYD రామంతపూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటినట్లు అధికారులు తెలిపారు. హైకమాండేషన్ (UNGA) ఆర్యవీర్ గుప్తా, అర్జున్‌రావు వర్బల్ మెన్షన్ (UNHRC), వైష్ణవి వర్బల్ మెన్షన్(ECOSOC), తుమ్మల అక్షయ బెస్ట్ రిపోర్టర్‌గా గెలుపొందినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా వారికి పాఠశాల యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపారు.