News September 23, 2024

HYD: అక్రమ నల్లా కనెక్షన్ గుర్తిస్తే కాల్ చేయండి: MD

image

అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. HYD నగరంలో ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగించినట్లు గుర్తిస్తే విజిలెన్స్ బృందానికి 9989998100, 9989992268 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని కోరారు.

Similar News

News February 12, 2026

RR: రేపే లెక్కింపు.. మధ్యాహ్నానికే ఫలితాలు!

image

మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. రేపు 64 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఇందుకోసం 254 మంది సిబ్బందిని నియమించారు. షాద్‌నగర్‌లో అత్యధికంగా 14, ఆమనగల్‌లో అత్యల్పంగా 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఫలితాలు వెల్లడించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి ఇన్‌ఛార్జ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

News February 12, 2026

ఫ్యూచర్ సిటీ, RRR.. పల్లెల రూపు రేఖలు మారనున్నాయా.?

image

ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో గొప్ప నగరాన్ని నిర్మించి చూపిస్తామని రేవంత్ సర్కార్ ఢంకా బజాయించి చెబుతోంది. దీంతో పాటు కందుకూరు, యాచారం, తలకొండపల్లి, ఆమనగల్ ప్రాంతాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానున్న విషయం విదితమే. ఈ ప్రాజెక్టుల గనుక నిర్మాణం చేపడితే ఇక్కడి పల్లెల రూపు రేఖలు నిజంగా మారే అవకాశం ఉందా అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. మీ కాంమెంట్.

News February 11, 2026

3pm రంగారెడ్డి అప్‌డేట్.. దూసుకొచ్చిన ఆమన్‌గల్

image

RR మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 2 తర్వాత ఓటర్లు కేంద్రాలకు కదిలారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మ.3గం. వరకు జిల్లాలో 68.77% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆమనగల్లులో 76.33%, చేవెళ్ల 73.04% ఇబ్రహీంపట్నం 68.6%, మొయినాబాద్ 69.79, శంకర్‌పల్లి 65.19, షాద్‌నగర్‌లో 65.25% నమోదైంది. పోలింగ్‌కు మరో 1:10 గం. సమయం మిగిలి ఉంది.