News February 20, 2025
HYD: అగ్నికనిక యాదయ్య యాదిలో 15 ఏళ్లు.!

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సిరిపురం యాదయ్య ఆత్మ బలిదానం చేసుకొని నేటికీ 15ఏళ్లు అయ్యింది. 2010లో నేటి రోజున RR జిల్లా నాగారం ప్రాంతానికి చెందిన యాదయ్య ఓ అనాథ. 19 ఏళ్ల వయస్సులో ఓ హోటల్లో పనిచేసుకుంటూ చదువుకునే రోజుల్లో తెలంగాణ కోసం అమరుడయ్యాడని చంచల్‌గూడ ఎస్పీ శివకుమార్ అన్నారు. తెలంగాణ ఫలాలు అనుభవిస్తున్నవారిలో ఎంత మందికి గుర్తున్నాడో..? మన యాదయ్య. జై తెలంగాణ!జై జై తెలంగాణ..! అంటూ ట్వీట్ చేశారు.
Similar News
News March 16, 2025
HYD: అంతర్జాతీయ ప్రమాణాలతో బేగంపేట రైల్వే స్టేషన్

బేగంపేట రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. రూ.26 కోట్ల వ్యయంతో ప్రారంభమైన మొదటి ఫేజ్ పనులు తుదిదశకు చేరుకోగా.. రైల్వే స్టేషన్ ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రయాణికుల కోసం ర్యాంపులు, లిస్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్, రైల్వే సమాచారాన్ని ప్రత్యక్షంగా చూసుకునేలా డిస్‌ప్లే తదితరాలు ఏర్పాటు చేశారు. స్టేషన్ ప్రాంగణాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి.
News March 16, 2025
HYD: ఓయూ క్యాంపస్‌లో ఇవి బంద్!

ఓయూలో ఆందోళనలు, ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అణిచివేయాలని చూస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.
News March 15, 2025
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షకు 759 మంది గైర్హాజరు

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 సెంటర్లలో 62,053 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 61,294 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 759 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.