News October 25, 2024
HYD: అగ్రికల్చర్ యూనివర్సిటీలో భారీగా పెరిగిన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు

HYD రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ యూనివర్సిటీలో 2024-25లో B.Sc (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం 227 సీట్లు ఉండగా మరో 200 పెంచినట్లు వీసీ ఆల్దాస్ జానయ్య తెలిపారు. ఈ సీట్లకు వార్షిక ఫీజులు సైతం తగ్గించామని, పెరిగిన సీట్లను వ్యవసాయ కళాశాలలో సర్దుబాటు చేస్తామన్నారు. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ అనంతరం వీటికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
Similar News
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.
News November 19, 2025
సా.4 గంటల వరకు సచివాలయ ఉద్యోగులకు వైద్యశిబిరం

రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఉద్యోగులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఉ.11 గంటలకు ప్రారంభమయ్యే శిబిరం సా.4 గంటల వరకు ఉంటుందన్నారు. నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలందిస్తారని.. సచివాలయ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య స్పృహ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
News November 19, 2025
ఈ నెల 25న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం

ఈ నెల 25న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. పాలక మండలి పదవీ కాలం కేవలం 2 నెలలు మాత్రమే ఉండటంతో పలు నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశం కీలకం కానుందని సమాచారం. తమ డివిజన్లలో సమస్యలను పరిష్కరించాలంటూ కార్పొరేటర్లు డిమాండ్ చేసే అవకాశముంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ అధిక నిధులు విడుదల చేశారని.. తమకు కూడా విడుదల చేయాలని కోరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.


