News March 25, 2024

HYD: అగ్రికల్చర్ స్టడీ చేయాలని ఉందా..? మీ కోసమే!

image

అగ్రికల్చర్ స్టడీ చేయాలనుకునే వారికి HYD రాజేంద్రనగర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్, PGD ఇన్ అగ్రి వేర్ హౌసింగ్ మేనేజ్‌మెంట్ కోర్సుల ప్రవేశాల దరఖాస్తు గడువు మార్చి 31న ముగుస్తుందని తెలిపారు. మిగతా వివరాలకు వెబ్ సైట్ www.manage.gov.in చూడండి.

Similar News

News November 12, 2025

జూబ్లీహిల్స్: సర్వేల్లో BRS.. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్..!

image

జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలపై లోకల్ వాళ్లే కాదు తెలుగు రాష్ట్రాల వారు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఎలక్షన్ ముందు దాదాపు అన్ని సర్వేలు BRS గెలుస్తుందని చెప్పగా ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. దీంతో థగ్ ఆఫ్ వార్ పోటీ ఉందంటూ ఇరు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. NOV 14న వెలువడే ఫలితాల్లో గెలుపు మాదే అంటూ ఇరు పార్టీలు ధీమాగా ఉన్నాయి.

News November 12, 2025

HYD రానున్న.. ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ

image

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ డిసెంబర్‌లో HYDకు రానున్నారు. CM రేవంత్ రెడ్డి రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికకు మెస్సీని బ్రాండ్ అంబాసడర్‌గా నియమించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రణాళిక ద్వారా తెలంగాణను 2033 నాటికి 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.

News November 12, 2025

జూబ్లీహిల్స్ EXIT POLLS.. BRS, కాంగ్రెస్‌ వార్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మంగళవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పై BRS, కాంగ్రెస్ నేతల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్, HMR,నాగన్న, జనమైన్, స్మార్ట్ పోల్,ఆరా మస్తాన్ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించగా మిషన్ చాణక్య, క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ BRS గెలుస్తుందని చెప్పాయి. దీంతోNOV 14న దేఖ్లేంగే అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. మీ కామెంట్?