News February 4, 2025

HYD: అడ్డొచ్చిన పంది.. MLA గన్‌మెన్ మృతి (UPDATE)

image

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల MLA గన్‌మెన్ శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలు.. మృతుడు శంకర్‌పల్లి మం. బుల్కాపూర్ వాసి. వికారాబాద్ జిల్లా AR కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లిన అతడు రిటర్న్ అయ్యాడు. బైక్‌కు <<15346555>>అడవి పంది అడ్డురావడంతో<<>> తప్పించే క్రమంలో కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో శ్రీనివాస్ మృతి చెందాడు. సోమవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Similar News

News December 23, 2025

పర్యాటక అద్భుతాలు పరిచయం చేస్తే బహుమతులు: ASF కలెక్టర్

image

కొమురం భీమ్ జిల్లాలో దాగి ఉన్న పర్యాటక అందాలను ఫొటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భారీ నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పర్యాటక శాఖ అధికారి అష్ఫాక్ అహ్మద్‌తో కలిసి ‘100 వీకెండ్ వండర్స్’ గోడ ప్రతులను ఆవిష్కరించారు.

News December 23, 2025

నేడు నల్గొండకు KTR

image

ఉద్యమాల గడ్డ నల్గొండ జిల్లా కేంద్రానికి మంగళవారం మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రానున్నారు. నల్గొండ జిల్లాలో BRS పార్టీ బలపరిచి గెలుపొందిన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లను కలిసి KTR అభినందిస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్దకు సమయానికి హాజరుకావాలని కార్యకర్తలకు నేతలు పిలుపునిచ్చారు.

News December 23, 2025

MNCL: నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు అవకాశం

image

2026 మార్చిలో నిర్వహించే పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి నామినల్ రోల్స్‌లో తప్పులు ఉంటే సవరించేందుకు ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. విద్యార్థుల వార్షిక మెమోలలో ఎలాంటి తప్పులు రాకుండా, అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం మార్పులు ఉంటే పాఠశాల ఎస్ఎస్సీ లాగిన్ ద్వారా ఎడిట్ చేసుకోవాలని సూచించారు.