News February 4, 2025
HYD: అడ్డొచ్చిన పంది.. MLA గన్‌మెన్ మృతి (UPDATE)

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల MLA గన్‌మెన్ శ్రీనివాస్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాలు.. మృతుడు శంకర్‌పల్లి మం. బుల్కాపూర్ వాసి. వికారాబాద్ జిల్లా AR కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం బంధువుల ఇంటికి వెళ్లిన అతడు రిటర్న్ అయ్యాడు. బైక్‌కు <<15346555>>అడవి పంది అడ్డురావడంతో<<>> తప్పించే క్రమంలో కిందపడిపోయాడు. తీవ్రగాయాలతో శ్రీనివాస్ మృతి చెందాడు. సోమవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News January 16, 2026
నితీశ్‌పై తీవ్ర విమర్శలు.. తిప్పికొట్టిన విహారి

భారత జట్టుకు ఆల్‌రౌండర్‌గా పనికిరాడంటూ నితీశ్ రెడ్డిపై వస్తున్న విమర్శలపై హనుమ విహారి Xలో స్పందించారు. ’22 ఏళ్ల వయసులో బ్యాటింగ్, పేస్ బౌలింగ్ చేసే క్రికెటర్లు దేశంలో ఎవరైనా ఉన్నారా? నితీశ్ ఇప్పటివరకు 3 వన్డేల్లో 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 4 T20ల్లో 3W, 4th సీమర్‌గా 10 టెస్టుల్లో 8W పడగొట్టాడు. మెల్బోర్న్‌లో సెంచరీ చేశాడు. అది ఇప్పటికీ చాలా మందికి నెరవేరని కల’ అంటూ నితీశ్‌కు మద్దతునిచ్చారు.
News January 16, 2026
సిద్దిపేట: సోషల్ మీడియా లింక్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: సీపీ

సిద్దిపేట పోలీస్ కమిషనర్ సీపీ రష్మి పెరుమాళ్ జిల్లా ప్రజలకి ముఖ్య విషయం విజ్ఞప్తి చేశారు. ‘రూ.5 వేలు వస్తాయి.. లింక్స్ షేర్ చేస్తే’ అని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు వస్తున్నాయని, ఇలాంటి ఫేక్ లింక్స్ నమ్మవద్దని తెలియజేశారు. ఇలాంటి లింక్స్ క్లిక్చేస్తే సైబర్ నేరగాళ్ల చేతులకి దొరికిపోతామని హెచ్చరించారు. లింక్ పై క్లిక్ చేస్తే ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
News January 16, 2026
నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

⏵నల్గొండ: లింకులను క్లిక్ చేస్తే బుక్ అయినట్లే: డీఎస్పీ
⏵నార్కట్ పల్లి: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న చెరువుగట్టు
⏵నల్గొండ: వర్గపోరుతో ఎవరికి లాభం చేకూరేనో..
⏵నల్గొండలో ఇక నవశకం
⏵కేతేపల్లి: ఐదు రోజుల్లో 3 లక్షలకు పైగా వెహికల్స్ పాస్
⏵చండూర్: పండుగ పూట తాగునీటి కష్టాలు
⏵చిట్యాల: 53 వానరాల బందీ
⏵నల్గొండ: జిల్లాలో ఫార్మసీ రిజిస్ట్రీ అంతంతే
⏵నల్గొండ ఆసుపత్రిలో ఇదీ పరిస్థితి


