News July 30, 2024
HYD: అత్యాచారం.. ఆస్ట్రేలియాకు పారిపోతుండగా అరెస్ట్
యువతిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అమ్మాయితో స్వామికి FBలో పరిచయమైంది. ఆమెను HYDకి రప్పించిన అతడు పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేశాడు. చివరకు ఆస్ట్రేలియా పారిపోయేందుకు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో మహంకాళీ పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోనే స్వామిని అరెస్ట్ చేశారు. CI పరశురాం, SIలు వెంకటేశ్వర్లు, పరదేశి జాన్, కానిస్టేబుల్స్ వంశీ, రుషి చరణ్ సిబ్బంది ఉన్నారు.
Similar News
News October 11, 2024
జీహెచ్ఎంసీ పథకాలను ప్రశంసించిన ఏపీ అధికారులు
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మున్సిపల్ అధికారులు, జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న పథకాలను గురువారం సమీక్షించారు. ముఖ్యంగా ట్యాక్స్, ఫైనాన్స్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కంట్రోల్ రూమ్ వంటి విభాగాల్లో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలను ప్రదర్శించారు.
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు వివిధ విభాగాలలో తమ విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
News October 11, 2024
సొంతూళ్లకు ప్రయాణం.. హైదరాబాద్ ఖాళీ!
హైదరాబాద్ ఖాళీ అవుతోంది. దసరా సెలవులకు ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు MGBS, JBS, ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద బస్టాపుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సొంత వాహనాల్లోనూ బయల్దేరడంతో సిటీ శివారుల్లోని టోల్‌గేట్ల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి, బీబీనగర్, దుద్దెడ టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే నగరంలో ట్రాఫిక్ కాస్త తగ్గింది.
News October 11, 2024
తెలంగాణ ఉద్యమకారుల కమిటీ రద్దు: పిడమర్తి రవి
తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి సంబంధించిన కమిటీని రద్దు చేస్తున్నట్లు సంఘం వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి గురువారం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కమిటీలో ఉన్న ఛైర్మన్ ఇనుప ఉపేందర్, అధ్యక్షుడు దాసర్ల శ్రీశైలం, కన్వీనర్ MD రహీమ్ కూడిన కమిటీని వెంటనే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే తదుపరి కమిటీని ప్రకటిస్తామని ఆయన వివరించారు.