News June 26, 2024
HYD: అది చిరుత పులి కాదు.. అడవి పిల్లి!

HYD శివారు శంషాబాద్ ఘాంసిమియగూడలో ఆపరేషన్ చిరుత సుఖాంతమైంది. అది చిరుత పులి కాదని గుర్తించిన ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు. అడవి పిల్లి కదలికలు రికార్డ్ అయినట్లు వెల్లడించారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని డీఎఫ్ఓ విజయానందరావు సూచించారు. SHARE IT
Similar News
News October 31, 2025
HYD: ఉక్కుమనిషి ‘సర్దార్’ ఎలా అయ్యారో తెలుసా?

1928లో గుజరాత్‌లోని బర్దోలి తాలూకాలో బ్రిటిష్ ప్రభుత్వం భూమిశిస్తు 30% పెంచగా రైతులు ఆగ్రహించారు. ఎన్నో విన్నపాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు. పటేల్ స్ఫూర్తితో వారంతా సత్యాగ్రహానికి దిగారు. 137 గ్రామాల రైతులు ఐక్యంగా పోరాడారు. ఒత్తిడికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం శిస్తు తగ్గించక తప్పలేదు. రైతుల ఐక్యతకు శిఖరంగా నిలిచిన ఈ పోరాటం పటేల్‌ను ‘సర్దార్’ చేసింది. ఆయన చొరవతోనే HYD భారత్‌లో విలీనం అయింది.
News October 31, 2025
HYD: అజహరుద్దీన్ ప్రస్థానం ఇదే!

రాజ్ భవన్లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్‌లో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.
News October 31, 2025
HYD: ‘3 నెలల క్రితమే మంత్రి పదవిపై నిర్ణయం’

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అజార్‌పై ఉన్న కేసుల గురించి స్పష్టంగా చెప్పాలంటే కిషన్‌రెడ్డి ముందుకు రావాలని సవాల్ విసిరారు. 3 నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవిపై నిర్ణయం తీసుకున్నామని, దీంతో మైనారిటీలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.


