News April 3, 2024

HYD: అద్దె కార్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

లాంగ్ డ్రైవ్‌లో అద్దెకు కార్లు తీసుకొని వాటిని అమ్ముతున్న ముఠాను HYD మాదాపూర్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఏసీపీ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో ఉంటున్న హరీశ్ కుందారపు అనే వ్యక్తికి, సదరు వ్యక్తులు కార్లు ఇవ్వడంతో వీరికి కొంత కమిషన్ రూపంలో హరీశ్ అనే వ్యక్తి ఇస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6 కార్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News December 22, 2025

FLASH: HYD: లారీ ఢీకొని SI దుర్మరణం

image

మేడిపల్లి PS పరిధి నారపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో SI ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ప్రకారం.. ఉప్పల్ నుంచి అన్నోజిగూడ వైపు బైక్‌పై వెళ్తున్న AR SI రఘుపతి(59)ని నారపల్లి మసీదు సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News December 22, 2025

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్

image

హైదరాబాద్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. 40 మంది యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన యూనివర్సిటీ సిబ్బంది వైద్య చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రుల్లో తరలించారు. ఆహారం కలుషితం కావడంతో(డీ హైడ్రేషన్) వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 22, 2025

జీహెచ్‌ఎంసీ డిలిమిటేషన్‌పై హైకోర్టులో మరిన్ని పిటిషన్లు

image

జీహెచ్‌ఎంసీ డిలిమిటేషన్‌పై హైకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వార్డుల విభజన చేశారని లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే వార్డుల మ్యాప్, జనాభా వివరాలపై సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.