News October 22, 2024
HYD: అధికారులతో తుమ్మల సమావేశం

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు ఆహార ఉత్పత్తి అధికారులతో సమావేశం అయ్యారు. తెలంగాణలో ఆయిల్ ఫామ్, వ్యవసాయ ఆహార పరిశ్రమ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తమ కంపెనీ సిద్ధంగా ఉందని, అందుకు తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. దీనికి మంత్రి సానకూలంగా స్పందిస్తూ, ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
Similar News
News November 22, 2025
HYD: నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి

నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మిని సీఐడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట మంచు లక్ష్మి హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.
News November 22, 2025
HYD: అన్నపూర్ణ ఫిల్మ్ అకాడమీని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినీ నటుడు నాగార్జునతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. 1970లలో సరైన వసతులు లేనప్పుడు దిగ్గజ అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియోను స్థాపించడం, అది హైదరాబాద్లో ముఖ్యమైన సాంస్కృతిక ల్యాండ్మార్క్గా ఎదగడంపై డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు.
News November 22, 2025
HYD: స్టేట్ క్యాడర్ మావోయిస్టులు లొంగుబాటు.!

రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి.శివధర్ రెడ్డి ముందు నేడు భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. స్టేట్ క్యాడర్కు చెందిన అజాద్, అప్పా నారాయణ, ఎర్రాలు సహా పలువురు మావోయిస్టులు లొంగుబాటు కార్యక్రమానికి హాజరు కానున్నారు. లొంగుబాటుకు సంబంధించిన మరిన్ని వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.


