News November 29, 2024
HYD: అధికారులూ.. గుర్తుందా శీతాకాలం

HYD మహానగరంలో చాలామంది చలిలో వణుకుతూ ఫుట్‌పాత్‌పైనే పడుకుంటున్నారు. వారు చలికి ఇబ్బంది పడకూడదని జీహెచ్ఎంసీ గతంలో దుప్పట్లను పంపిణీ చేసేది. అయితే ఈసారి అధికారులు ఆ విషయమే మర్చిపోయారు. కృష్ణానగర్, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి, ఇందిరా నగర్, రెయిన్‌బో ఆస్పత్రి, సాగర్ సొసైటీ, ఖైరతాబాద్ చౌరస్తా, పంజాగుట్ట ప్రాంతాల్లో వందల మంది ఫుట్‌పాత్‌పై చలిలో అవస్థలు పడుతున్నా పట్టించు కోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
Similar News
News February 27, 2026
KPHBలో గజం భూమి రూ. 2.65 లక్షలు

KPHBలో హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్లు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలంలో KPHBలో చదరపు గజం భూమి గరిష్ఠంగా రూ.2.65 లక్షలకు విక్రయమైంది. 1400 ఎస్‌ఎఫ్‌టీ ఫ్లాట్ ధర రూ.1.10 కోట్లకు చేరింది. మొత్తం 12 ఆస్తుల వేలం ద్వారా రూ.24.26 కోట్ల ఆదాయం లభించినట్లు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. ఓపెన్ ప్లాట్స్ ద్వారా రూ.15.81 కోట్లు, ఫ్లాట్స్ రూ.8.45 కోట్లు వచ్చాయి.
News February 27, 2026
HYD: ఆ రోజు ఆలయాలు బంద్!

చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3న కడ్తాల్‌లోని మైసిగండి మైసమ్మ ఆలయంతో పాటు శివాలయ, రామాలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో స్నేహలత చెప్పారు. మూడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ శుద్ధి, అభిషేకం, అలంకరణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. గ్రహణం దృష్య్టా నగరంలోని ప్రముఖ ఆలయాలను సైతం మూసివేయనున్నారు.
SHARE IT
News February 27, 2026
HYD: ‘గాలి’ రిపేర్లు.. ‘అసలు’ బిల్లులు!

భూమి లోపల పైపులైన్ రిపేరు జరగదు కానీ కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి మాత్రం నిధులు చేరిపోతున్నాయి. పాత లీకేజీల ఫొటోలనే కొత్తవిగా చూపిస్తూ క్షేత్రస్థాయిలో పని చేయకుండానే బిల్లులు డ్రా చేసే ‘ట్రిక్కు’ జలమండలిలో వైరల్ అయ్యింది. సెక్షన్ ఆఫీసర్ల అండదండలతోనే ఈ బోగస్ బిల్లుల దందా సాగుతోంది. థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ పేరుకే తప్ప అంతా కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఈ అవినీతి మురికిని కడగాల్సి ఉంది.


