News April 1, 2024
HYD: ‘అధిక ధరలు వసూలు చేస్తే.. ఫిర్యాదు చేయండి’
గ్రేటర్ HYDలో గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ DT మాచన రఘునందన్ తెలిపారు. గ్యాస్ డోర్ డెలివరీ ఆలస్యం చేయడంతో వినియోగదారులే డీలర్ల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి పలుచోట్ల ఏర్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైల్ ధరకు రూ.1 అధికంగా అడిగినా అక్కడే నిలదీయాలని, వినకుంటే తమకు Xలో ఫిర్యాదు చేసినా స్పందిస్తామన్నారు.
Similar News
News November 24, 2024
HYD: ‘బఫర్ జోన్‌లో హైడ్రా కమిషనర్ ఇల్లు’.. క్లారిటీ
హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘మధురానగర్‌లోని మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. 44 ఏళ్ల క్రితం మా నాన్న కట్టించిన ఇంట్లోనే ఉంటున్నాను. 25 ఏళ్ల క్రితం చెరువులో కృష్ణకాంత్ పార్క్ నిర్మించారు. మా ఇంటికి ఒక కిలో మీటర్ దూరంలో ఉంది. మధ్యలో వేలాది ఇండ్లు ఉన్నాయి’ అని స్పష్టం చేశారు.
News November 24, 2024
HYD: మహిళకు SI వేధింపులు..!
HYDలోని ఓ SI వేధిస్తున్నారని గృహిణి సీపీ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ప్రకారం.. ‘నా భర్త వేధింపులు తాళలేక PSలో ఫిర్యాదు చేశాను. అందులోని నా మొబైల్ నంబర్ తీసుకుని SI పర్సనల్ మెసేజులు చేస్తూ వేధిస్తున్నారు’ అని వాపోయారు. ‘నీ కేసు నేను పరిష్కరిస్తా.. మీ ఇంటికి వస్తా’ అంటూ అసభ్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.
News November 24, 2024
HYD: 15 ఏళ్లు దాటితే సీజ్ చేయండి: మంత్రి
15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఖైరతాబాద్‌లో జరిగిన మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్‌నెస్, ఇన్స్యూరెన్స్, RC సహా అన్ని పత్రాలు చెక్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల స్కూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలన్నారు. 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు, మౌలిక వసతులపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.