News February 3, 2025
HYD: అనుమతి నిరాకరించడంపై మందకృష్ణ ఫైర్

లక్ష డప్పులు.. వేయి గొంతులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడుతూ.. సీఎం, డీజీపీ HYD సిటీ సీపీ పునరాలోచించాలని, పునఃసమీక్ష చేసి అనుమతిని మంజూరు చేయాలన్నారు. MRPS ఏ రోజూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పని చేయలేదని, మాదిగ పల్లెలో కనుమరుగవుతున్న డప్పులు మళ్లీ పునరుజ్జీవం పోసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News February 9, 2025
HYD: చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టర్ (PHOTO)

తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణాలు పోసింది ఓ డాక్టర్. నార్సింగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యశ్వంత్ అనే వ్యక్తి చనిపోయాడు. ఇదే యాక్సిడెంట్‌లో డా. నంగి భూమిక(24) తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్‌దాన్ బృందం ఐదుగురు పేషంట్లకు ఆర్గాన్లు అవసరమని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. భూమిక గుండె, లీవర్, కళ్లు, కిడ్నీలను దానం చేసి ఐదుగురికి ప్రాణం పోశారు.
News February 9, 2025
UPDATE: HYD: ఆస్తి కోసమే తాత హత్య!

ఆస్తి గొడవల కారణంగా వ్యాపారవేత్త జనార్దన్ రావును మనవడు హత్య చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వెల్జాన్ గ్రూప్‌లో ఓ మనవడికి జనార్దన్ డైరెక్టర్ పోస్టును ఇచ్చాడు. తనకు ఏం ఇవ్వలేదని కోపం పెంచుకున్న కీర్తి తేజ తాతపై 73 సార్లు కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా అటాక్ చేసి ఏలూరుకు పారిపోయాడు. పోలీసులు నిందితుడిని ఏలూరులో అరెస్ట్ చేశారు.
News February 9, 2025
HYD: బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు!

నార్సింగి PS పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను మధుసూదన్, జయంత్, సాయి, తరుణ్ అత్యాచారం చేసి ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆమె రూ.10వేలు వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడీగా ఉంటున్న బాలికను తల్లి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిని శుక్రవారం రిమాండ్ చేశారు.