News December 6, 2024
HYD: అన్నింటా ఆరితేరారు.. వీరితో జాగ్రత్త..!

HYDలో సైబర్ మోసాలు, వ్యభిచార కార్యకలాపాలు, నకిలీ యాప్స్, డ్రగ్స్ రవాణా వంటి అనేక కేసుల్లో విదేశీయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గత మూడేళ్లలో డ్రగ్స్ సరఫరా కేసుల్లో దాదాపు 31 మంది ఉండటం గమనార్హం. ఇందులో 90% నైజీరియన్లే ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. నకిలీ కార్డులను తయారీలోనూ విదేశీయులు ఆరితేరారు. సింగపూర్, కంబోడియా, థాయిలాండ్, చైనా దేశాల కేంద్రంగా సైబర్ మోసాలూ జరుగుతున్నాయి.
Similar News
News April 19, 2026
HYD: అజ్జూ భాయ్ కోసం.. CM రేవంత్!

సీఎం రేవంత్ రెడ్డి నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ కానున్నారు. పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటా MLCలు ప్రొ.కోదండరామ్, అజహరుద్దీన్ పేర్లను ఆమోదించాలని ఆయన కోరనున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్‌కు ఈ నెలాఖరుతో ఆరు నెలల గడువు ముగియనుంది. ఈలోపు ఆయన ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నికవ్వడం తప్పనిసరి. ఒకవేళ గవర్నర్ ఆమోదం లభించకపోతే అజాహరుద్దీన్ తన మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది.
News April 19, 2026
HYD: మహిళలకు ఫ్రీ బ్యూటీషియన్ శిక్షణ

మొయినాబాద్‌లోని చిల్కూరులో SBI- RSETI ఆధ్వర్యంలో మహిళలకు ఈ నెల 24 నుంచి ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ మహ్మద్ అలీ తెలిపారు. 18- 45 ఏళ్ల మధ్య వయసు గల యువతులు, మహిళలు అర్హులు. ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్, 10th మెమోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 79819 51167 నంబరును సంప్రదించగలరు.
News April 19, 2026
ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన బల్కంపేట్ ఎల్లమ్మ

నగరంలో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో అమ్మవారు నేడు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆదివారం పురస్కరించుకొని ప్రత్యేకంగా అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని దర్శనానికి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. అమ్మవారి దర్శనానికి అరగంట పడుతోందని, వారాతం కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.


