News October 31, 2024
HYD: అన్ని జిల్లాల్లో సకుటుంబ సర్వేకు సిద్ధం!
HYD, RR, MDCL, VKB జిల్లాల్లో ప్రభుత్వం తలచిన సకుటుంబ సర్వేకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, జిల్లా, మండల కార్యాలయాల్లో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాల్లో ఎన్యుమరేటర్లకు అధికారులు శిక్షణ ఇచ్చారు. ప్రజలను అడగాల్సిన 50 ప్రశ్నలపై అవగాహన కల్పించారు. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధిపై సర్వే జరగనుంది.
Similar News
News November 9, 2024
HYD: టీవీ చూస్తుండగా విద్యుత్ తీగలు మీద పడి బాలుడి మృతి
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ<<14564376>> బాలుడు మృతి <<>>చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD కాప్రా మండలం జవహర్‌నగర్ ప్రగతినగర్‌లో నివాసముండే శానమ్మ కొడుకు వరుణ్ (7) శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి టీవీ చూస్తున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి పడి మంటలు అంటుకోవడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగినపుడు కుటుంబసభ్యులెవరూ లేరు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
News November 9, 2024
HYDలో తగ్గని చికెన్ ధరలు!
హైదరాబాద్‌లో చికెన్ ధరలు కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. కార్తీక మాసం ప్రారంభమైనప్పటికీ ధరలు యథావిధిగా ఉన్నాయని చికెన్ ప్రియులు చెబుతున్నారు. శుక్రవారం స్కిన్‌లెస్ రూ. 234 నుంచి రూ. 245 వరకు విక్రయించారు. విత్ స్కిన్ రూ. 200 నుంచి రూ. 215 మధ్య అమ్మకాలు జరిపారు. శనివారం కూడా ఇదే విధంగా ధరలు ఉండనున్నాయి. మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి.
SHARE IT
News November 9, 2024
HYD: పొగ మంచు.. ఇదీ పరిస్థితి!
HYD నగర శివారు, RR, MDCL, VKB జిల్లాలోని పలుచోట్ల 17 డిగ్రీల ఉష్ణోగ్రత సైతం నమోదవుతోంది. చలితో పాటు, పొగ మంచు ఉంటుంది. పొగ మంచు కారణంగా ప్రతి సంవత్సరం భారతదేశంలో దాదాపు 40 వేల ప్రమాదాల్లో 600 మంది మృత్యువాత పడుతున్నారు. 16,000 మంది గాయాల పాలవుతున్నారు. HYD నగరంలో ఏటా సగటున 380 నుంచి 400 ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా.. 50 మంది చనిపోతున్నారు. అధిక పొగ మంచులో అధికారులు డ్రైవింగ్ వద్దంటున్నారు.