News February 2, 2025
HYD: అప్డేట్ అయిన సిటీ డే పాస్

HYD సిటీ ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ 24 అవర్స్ టికెట్ అప్డేట్ అయింది. QR కోడ్, ఫోన్ నంబర్‌తో పాటు టికెట్ ప్రింట్ వస్తుంది.ఇంతకు ముందు QR కోడ్ లేకపోవడంతో కొంతమంది ప్రయాణికులు చెల్లని డే పాస్‌లతో ప్రయాణం చేస్తున్నా.. కొన్నిసార్లు కండక్టర్లు గుర్తించడం కష్టంగా ఉండేది. ఫోన్ నంబర్, QR కోడ్ ఉండడంతో నకిలీ టికెట్లు గుర్తించడం తేలిక అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Similar News
News December 4, 2025
వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని ఎలా గుర్తించాలి?

వరి పంట అక్కడక్కడ గుంపులు గుంపులుగా పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతోంది. సల్ఫైడ్ (గంధకం) దుష్ప్రభావమే దీనికి కారణం. సల్ఫైడ్ దుష్ప్రభావమున్న నేల బాగా మెత్తగా ఉండి, పొలంలో నడుస్తుంటే కాలు చాలా లోతుగా దిగబడి, గాలి బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుంచి దుర్వాసన రావడంతో పాటు మొక్కను వేర్లతో బయటకు తీస్తే కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే మొక్కలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది.
News December 4, 2025
వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావం – తీసుకోవాల్సి జాగ్రత్తలు

వరి పొలంలో ఉన్న మురుగు నీటిని బయటకు పంపి మళ్లీ కొత్త నీటిని పెట్టాలి. అమ్మోనియం సల్పేట్ వంటి ఎరువులను ఇలాంటి పొలాల్లో వాడకూడదు. 10 కేజీల స్వర్ణపాల్ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 100 కేజీల వర్మికంపోస్ట్‌లో కలిపి ఎకరం పొలంలో చల్లుకోవాలి. లీటర్ నీటికి నీటిలో కరిగే స్థూల పోషకాలు (19.19.19) 10 గ్రాములను, 3 నుంచి 5 గ్రాముల సూక్ష్మపోషకాలను లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
News December 4, 2025
నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లేవారు నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. చాగల్లు మండలం దారావరం గ్రామానికి చెందిన షైక్ నాగూర్ బేబీ ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో చిక్కుకున్నారు. కలెక్టర్ చొరవ, వికాస సంస్థ కృషి కారణంగా నాగూర్ బేబీ సురక్షితంగా స్వస్థలానికి చేరుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమె గురువారం కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


