News February 2, 2025
HYD: అప్డేట్ అయిన సిటీ డే పాస్

HYD సిటీ ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ 24 అవర్స్ టికెట్ అప్డేట్ అయింది. QR కోడ్, ఫోన్ నంబర్‌తో పాటు టికెట్ ప్రింట్ వస్తుంది. ఇంతకుముందు QR కోడ్ లేకపోవడంతో కొంతమంది ప్రయాణికులు చెల్లని డే పాస్‌లతో ప్రయాణం చేస్తున్నా.. కొన్నిసార్లు కండక్టర్‌లు గుర్తించడం కష్టంగా ఉండేది. ఫోన్ నంబర్, QR కోడ్ ఉండడంతో నకిలీ టికెట్లు గుర్తించడం తేలిక అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Similar News
News February 18, 2025
HYD: వాదిస్తూ.. కుప్పకూలిన సీనియర్ లాయర్

హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌కు గుండెపోటు వచ్చింది. హైకోర్టులో వాదిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టులో అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపేశారు. అన్ని కోర్టులో విచారణలు రేపటికి వాయిదా వేశారు.
News February 18, 2025
HYD: ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు: సీఎం

తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. HYDలోని హెచ్ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నేటి నుంచి 2 రోజుల పాటు షీల్డ్ -2025 కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలను కొనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును సీఎం ప్రారంభించారు.
News February 18, 2025
విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో జూనియర్, సీనియర్ డిప్లొమా అభ్యర్థులు తమ పరీక్షా ఫీజును వచ్చే నెల 5వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో పదవ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.