News March 23, 2024
HYD: అప్పుడు సన్నిహితులు.. ఇప్పుడు ప్రత్యర్థులు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, సికింద్రాబాద్ నుంచి గెలిచిన తీగుళ్ల పద్మారావు BRSలో ఉండి సన్నిహితంగా ఉన్నారు.కాగా ఇటీవల దానం కాంగ్రెస్‌లో చేరగా సికింద్రాబాద్ నుంచి ఎంపీ బరిలో ఉన్నారు. మరోవైపు BRSనుంచి పద్మారావు పోటీలో ఉండగా ప్రస్తుతం వీరు ప్రత్యర్థులుగా మారారు. ఇద్దరు MLAలు ఎంపీ బరిలో ఉండడం గమనార్హం. అయితే వీరిలో ఎవరు గెలిచినా ఉప ఎన్నికలు మాత్రం అనివార్యం కానున్నాయి.
Similar News
News October 17, 2025
యూసుఫ్‌గూడ: అవిభక్త కవలలు వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు

అవిభక్త కవలలు వీణా-వాణిల 23వ జన్మదిన వేడుకలను యూసుఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌లో గురువారం నిర్వహించారు. తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకుంటుందని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే, వైద్యరంగంలో జరిగిన అభివృద్ధితో తమ బిడ్డలైన అవిభక్త కవలలను విడదీసి సంపూర్ణ ఆరోగ్యంతో తమకు అప్పగించాలని కోరుతున్నారు.
News October 16, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: తొలి ర్యాండమైజేషన్ పూర్తి

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఈవీఎంలు, వీవీప్యాట్ల తొలి ర్యాండమైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇది నిర్వహించారు. ఆయా పార్టీల నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. జూబ్లీహిల్స్‌లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు 569 బ్యాలెట్ యూనిట్లు, 569 కంట్రోల్ యూనిట్లు, 610 వీవీప్యాట్లు కేటాయించారు.
News October 16, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. 4వ రోజు 19 మంది నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం కొత్తగా 19 మంది క్యాండిడేట్లు 21 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.