News November 29, 2024

HYD: అప్పు చేసి పిల్లలకు వంట చేస్తున్నారు: CITU

image

మధ్యాహ్న భోజన పథకం కార్మికులు MEO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. CITU జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్ మాట్లాడారు. కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, మెనూ ఛార్జీలు పెండింగులో ఉన్నాయన్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతూ.. కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Similar News

News November 20, 2025

గ్రేటర్ వైపు.. గులాబీ దళం చూపు

image

జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదు. నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ నిన్న దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపఎన్నిక ఓటమి తర్వాత KTR కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు. గతంలో గ్రేటర్ పీఠం BRSకు దక్కింది.. ఇప్పుడూ మనమే దక్కించుకుందామని పేర్కొన్నారు.

News November 20, 2025

ఎమ్మెల్యేల ఫిరాయింపు.. MLA గాంధీ న్యాయవాదుల విచారణ

image

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారనే పార్టీ ఫిరాయింపు విచారణకు సంబంధించి ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నేడు అసెంబ్లీ కార్యాలయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అడ్వకేట్లు తమ వాదనలు వినిపిస్తారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో ఆరుగురి విచారణ ముగిసింది.

News November 20, 2025

HYD: ఆందోళన కలిగిస్తున్న రేబిస్ మరణాలు

image

నగరవాసులను రేబీస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి పరిధిలో రేబీస్‌తో చనిపోయిన వారి సంఖ్య ఈ ఏడాది సెప్టెంబరు వరకు 32కు చేరింది. 2023లో 13, 2024లో 16 మంది మృతి చెందితే ఈఏడాది ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి ఏటా 20వేల మంది కుక్కకాటు బాధితులు వస్తారని సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.