News January 30, 2025

HYD: అఫ్జల్‌గంజ్ దొంగలను వదిలే ప్రసక్తే లేదు: సీపీ

image

HYDలోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు పరిశీలించి నిందితులు తెలివిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. కాగా.. దక్షిణాది రాష్ట్రాలకు చేరి అజ్ఞాతంలో ఉన్నట్లు HYD పోలీసులు నిర్ధారించారు. దోపిడీ దొంగలు తప్పించుకున్నా వారిని వదిలే ప్రసక్తే లేదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

Similar News

News November 10, 2025

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్‌తో కలిసి కలెక్టర్ ప్రజావాణిలో పాల్గొన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలు, వినతులు, పరిష్కారం నిమిత్తం 84 మంది దరఖాస్తు చేసుకున్న ప్రజల సమస్యలను విని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News November 10, 2025

ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

image

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <>sachet.rbi.org.in<<>> పోర్టల్‌లో సంస్థ పేరు, అడ్రస్, మోసం వివరాలు వంటి పూర్తి సమాచారాన్ని అందించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును బట్టి పోలీసులకు లేదా దర్యాప్తు సంస్థలకు పంపుతారు.

News November 10, 2025

HYD: మెడికల్ అకాడమీని సందర్శించిన మాజీ మంత్రి

image

మాజీ మంత్రి జానారెడ్డి ఈరోజు అపోలో మెడికల్ అకాడమీని సందర్శించారు. విద్యార్థులను ప్రశంసిస్తూ మాట్లాడారు. ఈ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశానికి మెడికల్ విద్యార్థులు అందిస్తోన్న సేవలను, డైరెక్టర్ పోసిరెడ్డి శ్రీనివాసరెడ్డి కృషిని ప్రశంసించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మంచి వెసులుబాటు కల్పించారని కొనియాడారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.