News February 3, 2025
HYD: అబద్ధాలు చెప్పిన KCR: కోదండరాం రెడ్డి

కాళేశ్వరం కట్టతో పాటు అది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అంటూ KCR అవాస్తవాలు కూడా నిర్మించారని MLC కోదండరాం రెడ్డి ఆరోపించారు. HYD సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ జర్నలిస్ట్ రేమిల్ల అవధాని రచించిన ‘కాళేశ్వరం ఫియాస్కో: ఎ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్’ పుస్తకాన్ని TG మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. KCR అబద్ధాలు చెప్పారని, కాళేశ్వరంతో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు.
Similar News
News February 14, 2025
మద్యం తాగేవాళ్లలో తెలంగాణ వారే టాప్

సౌత్ ఇండియాలో TGలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని రాజ్యసభలో మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు. అదే సమయంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య తగ్గిందని తెలిపారు. 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం APలో 34.9%, TGలో 53.8% మంది పురుషులు మద్యం సేవించేవారని వివరించారు. 2019-21 నాటికి ఇది APలో 31.2%, TGలో 50శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు.
News February 14, 2025
భర్త వేధింపులకు నవ వధువు ఆత్మహత్య

గోపాలపట్నంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. నాగేంద్రబాబు, వసంత 11 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పోర్న్ వీడియోలకు బానిసైన నాగేంద్ర భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన వసంత శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని KGHకి తరలించారు.
News February 14, 2025
దారుణం.. బుల్లెట్ బైక్ నడిపాడని చేతులు నరికేశారు

తమిళనాడులో దారుణం జరిగింది. శివగంగ జిల్లాకు చెందిన దళిత విద్యార్థి అయ్యసామి డిగ్రీ చదువుతున్నారు. ఇటీవల తనకిష్టమైన బుల్లెట్ బైకుపై కాలేజీకి వెళ్లొస్తుండగా ముగ్గురు అగ్రవర్ణ యువకులు అతడిపై దాడి చేశారు. ‘కులం తక్కువవాడివి.. మా ముందే బండెక్కుతావా, నీకు బుల్లెట్ కావాలా?’ అని కత్తులతో రెండు చేతులను నరికేశారు. అంతటితో ఆగకుండా సామి ఇంటినీ ధ్వంసం చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.