News October 21, 2024

HYD: అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా నివాళులు సీఎం

image

గోషామహల్‌లో పోలీసు అమరవీరుల స్మారకం వద్ద ఫ్లాగ్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు విడిచిన యోధులందరికీ పోలీసు అమరవీరులకు, కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. త్యాగానికి, సేవకు ప్రతీక పోలీసులు అని, కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. BRS మరింత అప్రమత్తం!

image

ఈరోజు జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్‌కు BRS అధిష్ఠానం మరింత అప్రమత్తమైంది. పాలకులు తప్పుదారి పట్టిస్తారేమోనని అనుమానం వచ్చి HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌కు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లను రంగంలోకి దించింది. ఎర్రోళ్ల శ్రీనివాస్, చిరుమర్తి లింగయ్య,క్రాంతి కిరణ్, గండ్ర వెంకట రమణారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించి కౌంటింగ్‌లో జరిగే తప్పులను గట్టిగా నిలదీసేలా ప్లాన్ చేసింది. 

News November 14, 2025

జూబ్లీహిల్స్ బై పోల్: అనుమానం వచ్చి ఫిర్యాదు చేస్తేనే VVPAT లెక్కింపు

image

మనం ఓటు వేసినపుడు ఓ స్లిప్ మనం ఎవరికి ఓటు వేశామో మనకు చూపించి ఆ తరువాత ఒక డబ్బాలో పడిపోతుంది. దానినే VVPAT అంటారు. ఆ స్లిప్పులను కౌంటింగ్ సమయంలో లెక్కించరు. అయితే పోలింగ్ శాతానికి, ఓట్లకూ లెక్క సరిపోవాలి. అలా కానిపక్షంలో ఏజెంట్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఆర్ఓతోపాటు సూపర్ వైజర్ VVPAT (Voter Verifiable Paper Audit Trail)  ఓట్లను లెక్కిస్తారు.

News November 14, 2025

జూబ్లీబైపోల్: పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌‌కు 47 ఓట్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో మొత్తం 101 మంది హోం ఓటింగ్ వేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌కు 47 మంది ఓటేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 43 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డికి 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం మొదటి రౌండ్‌లో భాగంగా షేక్‌పేట బూత్‌ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.