News June 11, 2024
HYD: అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్‌లో ఉద్యోగ భర్తీలకు నోటిఫికేషన్

HYD నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో ఉద్యోగ భర్తీలకు నోటిఫికేషన్ విడుదలైంది. భర్తీలో భాగంగా స్ట్రాటజిక్ కంటెంట్ కోఆర్డినేషన్ అసిస్టెంట్- కమ్యూనిటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం కమ్యూనికేషన్స్, బిజినెస్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. SHARE IT
Similar News
News March 15, 2025
HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

HYDలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం పగటి ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగినా గాలులు వీస్తుండడంతో ఉక్కపోత ఇంకా మొదలు కాలేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
News March 14, 2025
HYD: వైన్స్ బంద్.. తాటికల్లుకు ఎగబడ్డ జనం

హోలీ సందర్భంగా శుక్రవారం ప్రభుత్వం వైన్స్‌లను మూసివేసింది. మందుబాబులకు చుక్క మందు లేదు. దీంతో మత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ప్రకృతి ప్రసాదించిన తాటికల్లు కోసం క్యూ కట్టారు. తెల్లవారుజామునే ప్రతాపసింగారం సహా నగర శివార్లలో క్యాన్లు, బాటిళ్లతో బారులు తీరారు. గిరాకీ ఊహించని స్థాయికి చేరుకోవడంతో గీత కార్మికుల కళ్లల్లో ఆనందపు వెలుగులు మెరిశాయి.
News March 14, 2025
హోలీ సందర్భంగా నేడు ప్రజావాణికి సెలవు

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య తెలిపారు. దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి ఈ నెల 18న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని దివ్య సూచించారు.