News March 17, 2025
HYD: అమెరికాలో ప్రమాదం.. కొందుర్గు వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన BRS నాయకుడు, మాజీ MPTC, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ప్రగతి అత్త సునీత సిద్దిపేట జిల్లా బక్రీ చప్రియాల్ గ్రామం. అయితే, అంత్యక్రియలు అక్కడే చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News September 17, 2025
సిద్దిపేట: ‘RTI-2005ను పకడ్బందీగా అమలు చేయాలి’

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) 2005ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం-2005 పై పీఐఓలకు మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం కమిషనర్లతో కలసి పాల్గొన్నారు. ఆర్టీఐ దరఖాస్తులను సకాలంలో డిస్పోస్ చేయాలన్నారు.
News September 17, 2025
KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

KNR జిల్లా తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులకు “CCTV & హౌస్ వైరింగ్”పై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 18 నుంచి 45 సంవత్సరాలవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు అక్టోబర్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9849411002 నంబర్ను సంప్రదించవచ్చు.
News September 17, 2025
డేటింగ్ యాప్స్ చాలా డేంజర్: వరంగల్ సైబర్ పోలీసులు

డేటింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సైబర్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. చాటింగ్లో చెప్పేవన్నీ నిజాలు కావని, ప్రొఫైల్ ఫోటోలు చూసి మోసపోవద్దని సూచించారు. ఆన్లైన్ స్నేహాల పేరుతో మోసగాళ్లు వలపు వలలో చిక్కి ఆర్థికంగా నష్టపోవద్దని స్పష్టం చేశారు. ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.