News October 4, 2024
HYD: అమ్మవారి ఫేమస్ ఆలయాలకు మీరు వెళ్లారా?

HYD,ఉమ్మడి RRలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ మహంకాళమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట్ ఎల్లమ్మ, శామీర్‌పేట్ కట్ట మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మీ, గోల్కొండ జగదాంబిక, లాల్‌దర్వాజ సింహవాహిని,మైసిగండి మైసమ్మ, కొత్తపేట అష్టలక్ష్మీ, బోడుప్పల్ నిమిషాంబిక ఆలయాల్లో వివిధ రూపాల్లో మాతలు దర్శనమిస్తున్నారు.మరి ఈఆలయాలకు మీరు వెళ్లారా కామెంట్ చేయండి.
Similar News
News December 1, 2025
పాతబస్తీలో అండర్‌గ్రౌండ్ సర్జరీ!

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్‌లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్‌పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.
News December 1, 2025
హైదరాబాద్ శివారు రోడ్లకు మహర్దశ

HYD శివారు రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం రూ.390కోట్ల భారీ ప్రాజెక్టును ప్రకటించింది. 148.85 కి.మీ. మేర రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దడానికి టెండర్లు పిలిచింది. HAM పద్ధతిలో ప్రాజెక్టును చేపడుతున్నారు. దీని ప్రకారం, ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో కొంత భాగాన్ని ప్రభుత్వం నేరుగా భరిస్తుంది. ఈప్రాజెక్టును (PPP) ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాంతో చేపట్టనున్నట్లు అధికారులు Way2Newsకు తెలిపారు.
News December 1, 2025
HYD: కరెంటు బిల్లే క్రెడిట్ స్కోరు.!

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణను ప్రకటించనుంది. ‘రుణ చరిత్ర లేని’ ప్రజల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB) ఏర్పాటు కానుంది. ఈ సంస్థ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు వంటి చెల్లింపుల రికార్డులను పరిశీలించి ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా బ్యాంకులు లక్షలాది మందికి రుణాలు అందించే అవకాశం ఉందని అధికారులు Way2Newsకు తెలిపారు.


