News March 26, 2025
HYD: అమ్మానాన్న సారీ.. స్టేటస్ పెట్టి SUICIDE

మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో సోమేశ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోదరి వివాహం కోసం దాచిన డబ్బులతో పాటు సోమవారం జరిగిన IPLలో ఒక్కరోజే లక్ష పోగొట్టుకున్నాడు. దీంతో అతడు.. ‘నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడయ్యా. డబ్బుల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మానాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సారీ’ అని స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News October 15, 2025
కామారెడ్డి: ‘చట్టాలపై అవగాహన కల్పించాలి’

సమాచార హక్కు చట్టాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర కమిషనర్ భూపాల్ సూచించారు. బుధవారం రాత్రి కామారెడ్డి జిల్లా ఆర్టీఐ ప్రతినిధి మోతే లావణ్య హైదరాబాద్లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కమిషనర్ భూపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిపై పూర్తి వివరాలు సేకరించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉందని చెప్పారు.
News October 15, 2025
రెవెన్యూకు జీపీఓలు కీలకం: కలెక్టర్ రాహుల్ శర్మ

రెవెన్యూ శాఖకు జీపీఓలు (GPO) కళ్లు, చెవుల లాంటి వారని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఐడీవోసీలో నూతనంగా నియమితులైన జీపీఓలకు బుధవారం భూ భారతి దరఖాస్తుల పరిష్కారంపై శిక్షణ ఇచ్చారు. రెవెన్యూ విధులు అత్యంత కీలకమని, జీపీఓలు చాలా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు.
News October 15, 2025
సూర్యపేట: దేవాదుల నుంచి నీటిని రప్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లాకు దేవాదుల నుంచి నీటిని రప్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడలో సంగతన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకుడు శరత్ రౌత్, ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు.