News February 12, 2025
HYD: అమ్మాయిలు.. అలా చేస్తే ఊరుకోకండి: డీసీపీ

కొద్దిపాటి పరిచయం ఉన్నవారితోనూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రహస్యంగా అమ్మాయిల ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి, వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవ్వరికీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు పంపొద్దని HYD సైబర్ క్రైమ్ డీసీపీ కవిత సూచించారు. టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని, నగ్న విడియోలతో వేధింపులకు గురి చేస్తే మహిళలు మౌనంగా ఉండొద్దని 100, 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 15, 2025
దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి అండగా ఉంటాం: పవన్ కళ్యాణ్

అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జన సైనికుడు అడపా దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘జనసేన సభ నుంచి వెళ్తూ దుర్గాప్రసాద్ చనిపోయారని తెలిసి చింతిస్తున్నా. అతని కుటుంబానికి జనసేన అన్ని విధాలా అండగా ఉంటుంది’ అని పవన్ అన్నారు. పిఠాపురంలో నిన్న దుర్గాప్రసాద్‌కు కళ్లు తిరగ్గా.. బస్సులో కూర్చోపెట్టారు. ఇంటికి వచ్చాక గుండెపోటుతో చనిపోయారని స్థానికులు తెలిపారు.
News March 15, 2025
నిజామాబాద్: ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే రాములోరి తలంబ్రాలు

నిజామాబాద్ ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను అందజేయనున్నట్లు ఏటీఎం శనివారం తెలిపారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి వినియోగించిన ముత్యాలు, తలంబ్రాలు మార్చి 14 నుంచి రూ.151 చెల్లించి బుక్ చేసుకున్న వారికి కార్గో విభాగం హోమ్ డెలివరీ చేస్తుందని వివరించారు. మరిన్ని వివరాలకు ఉమ్మడి జిల్లాలోని బస్ డిపోలను సంప్రదించాలని కోరారు.
News March 15, 2025
నిర్మల్: పరీక్షలో 151 మంది విద్యార్థుల గైర్హాజరు

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 151 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ పరుశురాం తెలిపారు. మొత్తం 5,559 మంది విద్యార్థులకు గానూ 5,408 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.