News March 28, 2025
HYD: అమ్మాయిలూ.. ఆటో ఎక్కుతున్నారా?

HYDలో అనేక మంది ఆటోలను బుక్ చేసుకోవడం, ప్యాసింజర్ ఆటోలో ప్రయాణించడం చేస్తుంటారు. వారి భద్రత కోసం పోలీసులు ‘మై ఆటో ఈజ్ సేఫ్’ పేరుతో ఆటో డ్రైవరు వివరాలతో పాటు QR కోడ్ ఉండేలా ఏర్పాటు చేశారు. ఆటోలో ఏదైనా మర్చిపోయినా, ఆటో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించినా, ఆటోలోని క్యూఆర్ కోడ్ పోలీసులకు పంపిస్తే చాలు, వెంటనే చర్యలు చేపట్టి సహాయం చేస్తామని పోలీసులు తెలిపారు.
Similar News
News April 3, 2025
తిరుపతి మార్గంలో తప్పిన పెనుప్రమాదం

భాకరాపేట ఘాట్ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. కొంత మంది ప్రయాణికులతో మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సు తిరుపతికి బయల్దేరింది. ఘాట్ రోడ్డులోకి రాగానే బస్ బ్రేక్లు ఫెయిలయ్యాయి. గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశారు. ఆ తర్వాత చాకచక్యంగా రోడ్డు పక్కన ఉన్న కొండను ఢీకొట్టారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణనష్టం తప్పింది.
News April 3, 2025
‘అమరావతి’కి తొలి విడత రుణం.. ఖాతాలో రూ.3,535 కోట్లు జమ

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు తొలి విడతలో రూ.3,535 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ నిధులు ఇవాళ ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. త్వరలోనే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ADB) నుంచీ తొలి విడత రుణం మంజూరవుతుందని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ADB రూ.6,700 కోట్లు చొప్పున రుణం ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1,400 కోట్లు ప్రత్యేక సాయంగా అందిస్తోంది.
News April 3, 2025
WGL: వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

హనుమకొండ పోస్టల్ కాలనీలో హైటెక్ వ్యభిచారం చేస్తున్న ఇంటిపై సుబేదారి పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్స్, రూ.2,450 నగదు స్వాధీనపరచుకున్నామని ఏసీపీ మధుసూదన్ తెలిపారు.