News June 20, 2024

HYD: ‘అమ్మా నేను వెళ్లిపోతున్నా.. వచ్చే ఏడాది వస్తా’

image

యువకుడు అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తంగడపల్లికి చెందిన భిక్షమయ్య కుమారుడు ఠాను(20) డిగ్రీ చదువుతున్నాడు. 18న డిగ్రీ సెమిస్టర్ పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు. అనంతరం ‘అమ్మా నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నా.. మళ్లీ సంవత్సరం తర్వాత వస్తా’ అంటూ లెటర్ రాసి తన బైక్ తీసుకొని వెళ్లాడు. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో PSలో ఫిర్యాదు చేశారు.

Similar News

News October 17, 2025

యూసుఫ్‌గూడ: అవిభక్త కవలలు వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు

image

అవిభక్త కవలలు వీణా-వాణిల 23వ జన్మదిన వేడుకలను యూసుఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌లో గురువారం నిర్వహించారు. తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకుంటుందని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే, వైద్యరంగంలో జరిగిన అభివృద్ధితో తమ బిడ్డలైన అవిభక్త కవలలను విడదీసి సంపూర్ణ ఆరోగ్యంతో తమకు అప్పగించాలని కోరుతున్నారు.

News October 16, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: తొలి ర్యాండమైజేషన్ పూర్తి

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఈవీఎంలు, వీవీప్యాట్ల తొలి ర్యాండమైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇది నిర్వహించారు. ఆయా పార్టీల నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. జూబ్లీహిల్స్‌‌లో మొత్తం 407 పోలింగ్‌ కేంద్రాలకు 569 బ్యాలెట్ యూనిట్లు, 569 కంట్రోల్ యూనిట్లు, 610 వీవీప్యాట్లు కేటాయించారు.

News October 16, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. 4వ రోజు 19 మంది నామినేషన్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం కొత్తగా 19 మంది క్యాండిడేట్లు 21 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.