News July 13, 2024
HYD: అమ్మ మాట.. అంగన్వాడి బాట షెడ్యూల్..!

✓ జులై 15,16వ తేదీల్లో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి అంగన్వాడీల్లో చేర్చాలని కోరుతారు. ✓18న ఇంటింటికి వెళ్లి రెండున్నర ఏళ్ల చిన్నారులను గుర్తిస్తారు. ✓19న స్వచ్ఛ అంగన్వాడీ పేరిట కేంద్రాలను శుభ్రం చేసి, మొక్కలు నాటుతారు. ✓20న ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు.
Similar News
News September 15, 2025
HYD: 435 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్& డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 435 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 306 బైకులు, 30 త్రీవీలర్, 97 ఫోర్ వీలర్లు, 2 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News September 15, 2025
‘10 లక్షల మంది విద్యార్థులతో HYDలో మహాధర్నా’

నేటి నుంచి ప్రైవేట్ కళాశాలలు నిరవదిక బంద్ చేయనున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు సమ్మె బాట పట్టాయి. ఈ నెల 21, 22న 10 లక్షల విద్యార్థులతో HYDలో మహాధర్నా చేపడతామని, దసరాలోపు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తానని విద్యా సంస్థల సంఘాల నాయకులు తేల్చి చెప్పారు.
News September 15, 2025
HYD: ORRపై యాక్సిడెంట్.. క్షతగాత్రలు వీరే!

సరళ మైసమ్మ ఆలయానికెళ్లి తిరిగి వస్తుండగా అబ్దుల్లాపూర్మెట్ PS పరిధి ORRపై <<17713246>>కారు ప్రమాదానికి<<>> గురైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు చెందిన R.సౌమ్యరెడ్డి(25), స్నేహితులు నందకిషోర్, వీరేంద్ర, ప్రణీశ్, సాగర్, అరవింద్, జాన్సీ, శ్రుతితోపాటు మొత్తం 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌమ్యరెడ్డి, నందకిషోర్లను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా సౌమ్య మరణించిందని CI అశోక్ రెడ్డి తెలిపారు.