News December 13, 2024
HYD: అరెస్ట్ ఎపిసోడ్.. పుష్పకు మరింత క్రేజ్

బన్నీ అరెస్టు వార్తతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. టీవీలలో ఎప్పటికప్పుడు వార్తలు చూస్తూ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఏం జరుగుతోందో అని టెన్షన్తో గడిపారు. అరెస్టు చేస్తారా, చేస్తే రిమాండ్ చేస్తారా, మరి బెయిల్ వస్తుందా అని టీవీలకు అతక్కుపోయారు. చివరకు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ అరెస్టు సీన్తో ఆయనకు మరింత క్రేజ్ పెరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News September 17, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ

త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేషనల్ కో-ఆర్డినేటర్ ఎస్ మోహన్ రావు తెలిపారు. మంగళవారం బషీర్బాగ్లో పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత జెన్ని మహంతి శ్రీనివాస్ పోటీ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి లేని సమాజ నిర్మాణమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.
News September 16, 2025
రక్షణ శాఖ మంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం పికెట్ గార్డెన్లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
News September 16, 2025
HYD: పూడిక తీయండి.. సమస్య తీర్చండి!

నగరంలో వర్షం వచ్చిన ప్రతిసారి చాలాచోట్ల వరదనీరు నిలిచిపోతోంది. కారణం ఆయా ప్రాంతాల్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడమే. ఇలాంటి 40 ప్రాంతాలను హైడ్రా గుర్తించింది. అక్కడ డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను యుద్ధప్రాతిపదికన తొలగించడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నడుంబిగించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పూడిక తొలగిస్తే వరదనీటి సమస్యకు పరిష్కారం లభించినట్లవుతుంది.