News April 15, 2025
HYD: అర్ధనగ్న నృత్యాలు.. 17 మంది యువతులు అరెస్ట్

HYDలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్లో రైడ్స్ చేశారు. సమయానికి మించి పబ్ నడపడం, యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లని ఆకట్టుకునేలా యువతులతో ఇలా చేయించడం గమనార్హం. ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మొత్తం 17మంది యువతులు, పబ్ నిర్వాహకుడు, కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News December 8, 2025
ఏలూరు జిల్లాలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఉపాధి కార్యాలయం, నేషనల్ సర్వీస్, స్కిల్ డెవలప్మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 12న సత్రంపాడులోని ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమేష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బజాజ్ ఫైనాన్స్, మోహన్ స్పిన్ టెక్స్, ఎస్వీసీ సినిమాస్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. పది-డిగ్రీ ఉత్తీర్ణత పొందిన 18-35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని ఆయన తెలిపారు.
News December 8, 2025
కడప: ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించారని ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కడప కలెక్టర్లో జరిగిన రివ్యూ సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అందులో భాగంగా కడప కార్పోరేషన్ సరోజినీ నగర్ వార్డు సెక్రటరీ, సింహాద్రిపురం తహశీల్దార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్లను సస్పెన్షన్ చేశారు. సింహాద్రిపురం డీటీ, కడప విలేజ్ సర్వేయర్కు మెమోలు ఇచ్చారు.
News December 8, 2025
క్రిప్టో సంస్థలపై కేంద్రం చర్యలు.. ఎంపీ మహేష్ వెల్లడి

పన్ను చెల్లించని క్రిప్టో కరెన్సీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాల వారీగా క్రిప్టో సంస్థల నుంచి వసూలు చేసిన పన్నుల వివరాలు కోరుతూ ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. 2024-25 ఏడాదిలో వసూలు చేసిన లెక్కల ప్రకారం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు మొదటి 2స్థానాల్లో ఉండగా, AP 10వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.


